NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు

NTR Bharosa Pension

NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు

NTR Bharosa Pension : రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకనుంచి పెన్షన్ పొందేవాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.

WhatsApp Group Join Now

NTR Bharosa Pension Overview

ఆంద్రప్రదేశ్ లో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు.

పెన్షన్ పంపిణీలో మార్పులు

పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

PM Internship Scheme
PM Internship Scheme: యువతకు ప్రతి నెల రూ. 5,000 పీఎం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి
  • ఇందులో భాగంగా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపణీ యాప్ లో 20 సెకన్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్దిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆఢియో వినిపించాలని ఆదేశించింది.
  • అలాగే వృద్ధ పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని తెలిపింది.
  • అలాగే పెన్షన్ దారుల ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ లోనే నోట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు.
  • అలాగే పెన్షన్ దారుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
  • అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్ దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెర్ఫ్ సీఈవో కరుణ ఆదేశాలు ఇచ్చారు.
  • ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
  • రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది.
  • ఇప్పటికే అనర్హులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తోంది.
  • ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తి కరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

NTR Bharosa Pension App లో మరో కొత్త ఆప్షన్ రిలీజ్

పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే కింద చూపినట్టుగా ఆప్షన్లు ఇకమీదట కనిపించనున్నాయి.

  • Hospitalized
  • At Old age Home
  • Transferred from other secretariat
  • Disabled Student at School/College
  • Pensioner Came to Secretariat Location
  • Due to signal problem at pensioner’s house
  • At NREGS Worksite
  • Pensioner residing at relative’s house

పై అప్డేట్ తో కూడిన కొత్త NTR Bharosa Pension పెన్షన్ పంపిణి మొబైల్ యాప్ ఈ 26.02.2025 సాయంత్రం నుండి అందుబాటులో ఉండనుంది. అందరూ సచివాలయం ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని మీ తోటి ఉద్యోగులకు మరియు మీ యొక్క సచివాలయ మరియు మండల గ్రూపులలో షేర్ చేయగలరు.

తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన

అలాగే తాజాగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకం రిలీజ్ గురించి ప్రపంచం చేయడం జరిగింది. పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి.

తల్లికి వందనం రిలీజ్ డేట్ : Click Here 

Pay Electricity Bill Through Whatsapp
Pay Electricity Bill Through Whatsapp: వాట్సాప్ లోనే కరెంట్ బిల్లు పే చేయండి

🔻 Latest Govt Jobs : Click Here

🔍 Related TAGS 

ntr bharosa pension, ntr bharosa pension latest news, ntr bharosa pension status, ntr bharosa pension scheme, ntr bharosa pension online, nt bharosa pension scheme list, ntr bharosa pension application, ntr bharosa pension, ntr bharosa pension in ap, ntr bharosa pension pathakam, ntr bharosa pensions, ap ntr bharosa pensions, ntr bharosa pensions increment

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now