Ap Pension Verifications పెన్షన్ అనర్హుల ఏరివేత
Ap Pension Verifications News :: అర్హత లేకపోయినా పింఛన్ లబ్ధ్ది పొందుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిని గుర్తించే పనిని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే జిల్లాకి ఒక మండలం, మండలం కి ఒక సచివాలయం పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని పెన్షన్ వెరిఫికేషన్ చేశారు.. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రమంతా పెన్షన్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు రావడం జరిగింది..
పెన్షన్ల పై సీఎం కీలక ఆదేశాలు
AP లో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు.
అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు.
అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు.
తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు…
ఉద్దేశం :: ఖచ్చితమైన అర్హులకే పెన్షన్ చెందాలని.. అనర్హులకి పెన్షన్ రాకుండా.. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం అర్హులకే పెన్షన్ వచ్చే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభించారు..
Also Read :: AP లో అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్
ఏపీలో జూన్ నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి
ఆంధ్రప్రదేశ్ లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు చంద్రబాబు సర్కార్ గుడ న్యూస్ చెప్పింది.
టీడీపీ గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన టిడ్కో గృహాలను పూర్తిచేయాలని నిర్ణయించింది ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న 1.18లక్షల ఇళ్లను..
NDA ప్రభుత్వం ఏర్పడి ఏడాది కానున్న నేపథ్యంలో, వచ్చే ఏడాది జూన్ 12 నాటికి పూర్తిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు గడువు నిర్దేశించారు.
గృహ సముదాయాల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు పక్కాగా కల్పించి, గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు…
Also Read :: SBI లో 13,734 క్లర్క్ జాబ్స్ రిలీజ్
ఇంటర్ విద్యార్థుల కోసం తత్కాల్ పథకం
ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశ పెట్టాము.
నిర్ణీత రుసుము తో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాల్సింది గా కోరుతున్నాం. – నారా లోకేష్
ఏపీలో ఉచిత ప్రయాణం అమలుపై అధికారుల నివేదిక ఇదే
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే.. రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2 వేల బస్సులతో పాటు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. రవాణాశాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అధికారులిచ్చిన నివేదిక పైన పరిశీలన చేయనుంది.
🔍 Related TAGS
ap pension verifications, ntr bharosa pension, ntr bharosa pension scheme, ntr bharosa pension status, ntr bharosa pension latest news, ntr bharosa pension application, ntr bharosa pension 2024, ntr bharosa pension pathakam, ntr bharosa pension online, ntr bharosa pension in ap,ap pension latest news, ntr bharosa pension, ap ntr bharosa pensions, disable pension verification, ntr bharosa pensions, ntr bharosa pensions verification
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇