Ap News 2024 మార్చిలోగా నిర్మాణాలు.. లేదంటే ఇళ్ల రద్దు?
Ap News 2024 :: నేటికీ ప్రారంభం కాని 3 లక్షల గృహాల పనులు జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా, నేటికీ మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభమే కాలేదు.
2025 మార్చిలో గా లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను చేపట్టని పక్షంలో ఇంటి మంజూరు (హౌస్ శాంక్షన్) పత్రాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎక్కువమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టని జిల్లాల్లో ఎన్టిఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం ఉన్నాయి.
Also Read :: Ap లో అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్
ఈ జిల్లాల్లో సుమారు 70వేలకు పైగా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. మిగిలిన జిల్లాల్లో 2.30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పనులు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలు ఇవ్వడంతోపాటు మరో రూ.35 వేలు పావలా వడ్డీకి బ్యాంకుల నుంచి రుణం అందజేస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే నిధులు పునాదులకు కూడా సరిపోవడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు కేటాయించిన స్థలం వద్దకు వెళ్లేందుకు రహదారి లేకపోవడం, సురక్షితమైన తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్దిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Also Read :: SBI లో 13,735 క్లర్క్ జాబ్స్ రిలీజ్
పట్టణాలకు దూరంగా ఉండటం, రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల తాము పనులు చేసుకునేందుకు పట్టణాలకు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉందని లబ్దిదారులు చెబుతున్నారు. చిన్న ఇల్లు కట్టాలన్నా రూ.5 లక్షలు పైనే ఖర్చవుతుందని, పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను పెంచకపోతే ఇల్లు కట్టుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వం యూనిట్ ధరను పెంచాలని ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టని లబ్దిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇