Free Sewing Machines మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు..

Free Sewing Machines

Table of Contents

WhatsApp Group Join Now

Free Sewing Machines మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు..

Free Sewing Machines :: స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది.

ఇందులో ₹4 లక్షలు సబ్సిడీ, ₹4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది. పూర్తి వివరాలు ఈ పేజీలో మీకు అందించడం జరుగుతుంది.. చివరి వరకు చూసి డౌట్స్ ఉంటే వాట్సప్ లో మెసేజ్ చేయండి..

బీసీల స్వయం ఉపాధి పథకాలు

  • మహిళలకు టైలరింగ్ శిక్షణ
  • కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు
  • బీసీ, ఈబీసీలకు జనరిక్ షాపులకు ఆర్థిక సాయం

బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం ముఖ్యమంత్రికి పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటగా ఒకటి రెండు స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Also Read :- Ap లో అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్

సుమారు 80 వేల మంది బీసీ, ఈబీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని మండల కేంద్రాల్లోను, నగరాల్లోను, పట్టణాల్లోను డిమాండ్ ఉన్న చోట జనరిక్ షాప్ లను నడిపేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

Pm kisan 19th installment
PM Kisan 19th Installment లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

త్వరలో ఆన్లైన్ వెబ్సైట్ రిలీజ్

ఈ ఉచిత కుట్టు మిషన్ అప్లై చేసుకోవడానికి త్వరలో ఆన్లైన్ వెబ్సైట్ రిలీజ్ చేస్తామని చెప్పారు.. స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసేందుకు ఓబీఎంఎస్ వెబ్సైట్ ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు.

ట్రైనింగ్ ఎలా ఇస్తారు.?

  • ఒక్కో బీసీ, ఈబీసీ మహిళకు రోజుకు 4 గంటల చొప్పున ట్రైనింగ్ ఇస్తారు.
  • 90 రోజుల పాటు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు.
  • ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు.

శిక్షణ కేంద్రాలకు ఎంత పెట్టుబడి ఇస్తారు.?

శిక్షణ అనంతరం వారికి రూ.24,000 విలువ చేసే కుట్టు మిషన్లు అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

Also Read :: SBI లో 13,735 క్లర్క్ పోస్టులు రిలీజ్ 

ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్ కలిగిన బీసీ, ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఒక్కో షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ రూ.8లక్షలు అందించనుంది. అందులో రూ.4 లక్షలు సబ్సిడీగా ఇచ్చి, మిగిలిన రూ.4 లక్షలు రుణంగా ఇప్పించాలని నిర్ణయించారు. ఉపాధి పథకాల అమలు చేయాల్సిన పద్ధతులపై మంత్రి సవిత, డైరక్టర్ మల్లికార్జున్, ముఖ్య కార్యదర్శి పోలా భాస్కర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించారు.

అర్హతలు

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్
  • బ్యాంక్ అకౌంట్
  • మొబైల్ నెంబర్
  • ఈమెయిల్ ఐడి

గమనిక :: ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ అయితే ఇంతే.. ఒకవేళ మధ్యలో గవర్నమెంట్ ఏదైనా అప్డేట్ ఇస్తే మన వాట్సాప్ లో అప్డేట్ ఇస్తాను గ్రూప్ లో జాయిన్ అవ్వండి..

Ap Free Buss Scheme
Ap Free Buss Scheme మహిళలకు శుభవార్త

బీసీ మహిళలు, యువతకు GOOD NEWS

బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది BC, EBC మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్ శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో ₹4 లక్షలు సబ్సిడీ, ₹4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.

📢 Related TAGS

free sewing machine, sewing machine (product category), sewing, best sewing machine, sewing machine review, brother sewing machine, janome sewing machine, free sewing machine (industry), beginner sewing machine

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index