Ap Free Buss Scheme మహిళలకు శుభవార్త
Ap Free Buss Scheme :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
ఏపీ ఫ్రీ బస్సు స్కీమ్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఆర్టీసీ లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, ఆ సంస్థ ఎండీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే తదితర అధికారులతో సమీక్షించారు..
Also Read :- Ap లోని మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు
మొదట సంక్రాంతి కే ఫ్రీ బస్సు స్కీమ్
సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలుచేయాలని అనుకున్నాం’ అని మొదట సీఎం చెప్పగా..మంత్రి, అధికారులు స్పందిస్తూ… జీరో టికెటింగ్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందనీ.. 15 రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్ట మని తెలిపారు. దీనిపై చర్చ అనంతరం ఉగాది నుంచి అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి.. అలాంటివి మనకు ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికను సిద్ధం చేయండి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మంత్రివర్గ ఉపసంఘం జనవరి 3న కర్ణాటక, 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి.. అక్కడి పరిస్థితులపై నివేదిక సమర్పిస్తుంది’ అని మంత్రి రాంప్రసాదరెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు.
Also Read Post’s
డైలీ ఫ్రీగా తెలుగు న్యూస్ పేపర్స్ చదివేయండి..
Ap లో అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్
📢 Related TAGS
chandrababu on free bus scheme, free bus scheme in andhra pradesh, free bus scheme for ap women, ap free free bus scheme update, free bus scheme news, cm chandrababu about free bus scheme, free bus scheme for women, free bus scheme latest news, ap free bus scheme latest update
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇