
Table of Contents
🔍 AP New Ration Card Correction Process 2025
AP New Ration Card Correction Process : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ ఇప్పటికే చాలా జిల్లాలో ప్రారంభం అయ్యింది. అయితే మీ కొత్త రేషన్ కార్డు లో మీ యొక్క వివరాలు తప్పుగా ఉంటే వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి..ప్రాసెస్ ఏంటి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
♐ Overview AP New Ration Card Correction Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ముఖ్యమైన సేవల్లో ఒకటి స్మార్ట్ రేషన్ కార్డ్. ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు సబ్సిడీ ధరలకు అందించడమే కాకుండా, అనేక సంక్షేమ పథకాలకు ఈ కార్డ్ తప్పనిసరి. అయితే కొన్నిసార్లు రేషన్ కార్డులో తప్పులు, పేరు స్పెల్లింగ్ లోపాలు, కొత్త సభ్యులు చేరికలు, లేదా చిరునామా మార్పులు అవసరం అవుతాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం అందిస్తున్న Update / Correction సదుపాయం ద్వారా సులభంగా మార్పులు చేయించుకోవచ్చు.
🔥 New Ration Card Details
ఇప్పుడు వచ్చే కొత్త రేషన్ కార్డు లో ఏ వివరాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- Ration Card Number
- Ration Card Type
- Head Of The Family Name, Age, Gender
- Family Member’s Names, Age, Family Relationship
- Ration Shop ID, Address
- Family Permanent Adress
- Name and Address Of The Tahsildar’s Office
- Family Head Photo
- QR Code.
📌 QR Code లో కనిపించే వివరాలు – కొత్త స్మార్ట్ రేషన్ కార్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన New Smart Ration Card లో ఒక ప్రత్యేక QR Code ఉంటుంది. ఈ QR Code ను స్కాన్ చేస్తే కార్డు హోల్డర్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వస్తాయి. వీటిని తెలుసుకోవడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, స్కీమ్ సమాచారం, ట్రాన్సాక్షన్ హిస్టరీ అన్నీ ఒకే చోట చూడవచ్చు.
✅ QR Code స్కాన్ చేసినప్పుడు కనిపించే వివరాలు:
- కుటుంబ సభ్యుల పేరు, లింగం, వయస్సు
- ప్రతి సభ్యుడి వివరాలు విడిగా చూపిస్తాయి.
- కుటుంబ సంబంధం & eKYC స్టేటస్
- హెడ్డు ఆఫ్ ఫ్యామిలీ, కుమారుడు, కుమార్తె వంటి సంబంధం మరియు eKYC పూర్తయిందా లేదా అనే స్టేటస్.
- జిల్లా, మండలం, గ్రామం వివరాలు
- కార్డు హోల్డర్ ఎక్కడికి చెందినవారో స్పష్టంగా ఉంటుంది.
- రేషన్ షాప్ నంబర్
- మీకు రేషన్ ఇచ్చే షాప్ / FPS నంబర్.
- రేషన్ కార్డ్ టైప్ / వర్గం
- ఉదా: AAY, BPL, APL వంటివి.
- స్కీమ్ వివరాలు
- మీరు పొందుతున్న ప్రభుత్వ పథకం (Scheme) పేరు.
- రైస్ కార్డ్ నంబర్
- మీ కొత్త RC నంబర్ (Rice Card Number).
- తీసుకున్న రేషన్ సరుకుల సమాచారం
- నెలనెలా పొందిన బియ్యం, పప్పులు, చక్కెర, ఇతర సరుకుల వివరాలు.
- బయోమెట్రిక్ డేటా, తేదీ, స్థలం
- ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా రేషన్ తీసుకున్నారో చూపిస్తుంది.
📄 Required Documents
కొత్త రేషన్ కార్డ్ లో మార్పులు(లేదా) అప్డేట్ చేసుకునేందుకు అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Application Form
- New Ration Card Xerox
- Family Members Aadhaar Card Xerox
- Birth Certificate
🖊️ Application Process
- సచివాలయం / వార్డు కార్యాలయం వెళ్లాలి
- మీ ప్రాంతంలోని గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు సవరణ ఫారం అడగాలి.
- లేదా కింద ఇచ్చిన టేబులో అప్లికేషన్ ఫామ్ ఉంది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి.
- సమర్పించాల్సిన డాక్యుమెంట్లు
- Aadhaar Card (ప్రతి సభ్యుడిది)
- Address Proof (Electricity Bill / House Tax / Rental Agreement)
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ (Date of Birth తప్పుగా ఉంటే)
- మరణ ధృవపత్రం (మరణించిన వ్యక్తిని కార్డు నుండి తొలగించాలంటే)
- ఫారమ్ నింపడం
- పేరు, వయసు, చిరునామా, సంబంధం వంటి ఏ వివరాలు మార్చుకోవాలో స్పష్టంగా రాయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత
- మీ అప్లికేషన్‌కి ఒక Acknowledgement Number వస్తుంది.
- దాని ద్వారా మీరు ఆన్లైన్లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- కొత్త కార్డు జారీ
- సవరణలు పూర్తి అయిన తర్వాత, కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీకు ఇస్తారు.
🔍 గమనిక : ఆన్లైన్ ద్వారా మరియు whatsapp ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదు. కానీ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
⭐ ముఖ్య సూచనలు:
- రేషన్ కార్డు వివరాలు సరైనవిగా లేకపోతే, రేషన్ సరుకులు పొందడంలో సమస్యలు రావచ్చు.
- కాబట్టి, తప్పులు కనబడిన వెంటనే తప్పనిసరిగా సరిచేయించుకోవాలి.
- మార్పులు చేసిన తర్వాత కొత్త కార్డు వచ్చిందో లేదో QR Code స్కాన్ చేసి చెక్ చేయాలి.
🔗 Important Links
ఈ కొత్త రేషన్ కార్డ్ లో మార్పులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ లింక్, మీ కొత్త డిజిటల్ రేషన్ కార్డు ఇక్కడ ఉందో తెలుసుకోవడానికి గల లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
🔥 రేషన్ కార్డు కరప్షన్ అప్లికేషన్ ఫామ్ | Click Here |
🔥 మీకు ఇంకా డిజిటల్ రేషన్ కార్డు రాలేదా ? ఎక్కడుందో చెక్ చేసుకోండి | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
📽️ రేషన్ కార్డు కరెక్షన్ ఫుల్ డీటెయిల్స్
అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో రేషన్ కార్డు కరప్షన్ కి సంబంధించి పూర్తి వివరాలు వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాను.. క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
🏷️ Related TAGS
ration card download new process, new ration cards ekyc process 2025, ap new ration card, ap new ration card distribution, ap new ration cards registration, ap new ration card news, ap new ration card 2025, ap new ration cards updates, how to correction ration card online
❓ రేషన్ కార్డు సవరణలపై FAQs
1. నా రేషన్ కార్డు లో పేరు తప్పుగా ఉంది. దాన్ని ఎలా సరిచేయాలి?
మీరు దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయం లేదా MeeSeva కేంద్రంకి వెళ్లి సవరణ ఫారం నింపి, ఆధార్ మరియు గుర్తింపు పత్రాలు సమర్పించాలి.
2. చిరునామా మారితే రేషన్ కార్డు లో ఎలా అప్డేట్ చేయాలి?
Address Proof (Electricity Bill, Rent Agreement, Property Tax Receipt) ఇవ్వాలి. MeeSeva లేదా ఆన్లైన్ AePDS పోర్టల్ ద్వారా అప్లై చేయవచ్చు.
3. కుటుంబ సభ్యుల్లో ఎవరు మరణించినప్పుడు రేషన్ కార్డు లో ఎలాంటి మార్పు చేయాలి?
మరణ ధృవపత్రం (Death Certificate) సమర్పించి, ఆ సభ్యుడి పేరు కార్డు నుండి తొలగించవచ్చు.
4. కొత్తగా పుట్టిన బిడ్డను రేషన్ కార్డు లో ఎలా చేర్చాలి?
పుట్టిన సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు తో సచివాలయంలో అప్లై చేస్తే బిడ్డ పేరు జత అవుతుంది.
5. రేషన్ కార్డు వివరాలు సవరించడానికి ఎంత టైం పడుతుంది?
సాధారణంగా 15–30 రోజుల్లో కొత్త సవరించిన రేషన్ కార్డు వస్తుంది.
6. సవరణ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
మీరు పొందిన Acknowledgement Number ద్వారా AePDS వెబ్సైట్ లేదా MeeSeva పోర్టల్ లో స్టేటస్ చూడవచ్చు.
7. సవరణ కోసం ఏ పత్రాలు తప్పనిసరి?
- ఆధార్ కార్డు
- అడ్రస్ ప్రూఫ్
- పుట్టిన/మరణ ధృవపత్రం (అవసరాన్ని బట్టి)
- ఫోటో (కొన్ని సందర్భాల్లో)
8. రేషన్ కార్డు సవరణ కోసం ఏమైనా ఫీజు ఉంటుందా?
చిన్న మొత్తంలో సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇