Ap Volunteers
Ap Volunteers :: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా గాని వాలంటీర్లు ధర్నాలు అయితే చేస్తున్నారు.. కూటమి గౌర్నమెంట్ మాత్రం ఎక్కడ వాలంటీర్ల గురించి నోరు మెదపడం ఇవ్వడం లేదు. తాజాగా వాలంటీర్లకు సంబంధించి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రాష్ట్ర అసోసియేషన్ వాలంటీర్స్ అధ్యక్షుడు పిలుపు
వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టనున్నట్టు స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమాల్లో భాగంగా జనవరి 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్ లకు వాలంటీర్లు వినతి పత్రాలను అందజేయనున్నారు. 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ 4వ తేదీన బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఈశ్వరయ్య తెలిపారు.
ప్రస్తుతం వాలంటీర్లు పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నరకు పైగా వాలంటీర్స్ రాజీనామా చేయకుండా ఉన్నారు.. లక్ష మందికి పైగా రాజీనామా చేశారు.. అయితే గతంలో టిడిపి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్స్ ని కొనసాగిస్తామని, అధికారంలోకి రాగానే 10 వేలు గౌరవ వేతనం పెంచుతామని.. విధుల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది..
Also Read :: మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్లు పంపిణీ
మరి ప్రస్తుతం టిడిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది.. ఇప్పటికే ఎనిమిది నెలలో పూర్తి కాలం కావస్తుంది.. అయినా వాలంటీర్ గురించి పట్టించుకోవడం లేదు.. మంత్రిమండలి సమావేశాలలో మటుకు వైసిపి అడిగిన ప్రశ్నకి అసలు వాలంటీర్లు జీవోలో లేరని చెప్పడం జరిగింది.. దీన్నిబట్టి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మరి అసోసియేషన్ లందరూ కలిసి.. గతంలో మాకు ఎందుకు హామీ ఇచ్చావ్.. ఇప్పుడు ఎందుకు వాలంటీర్లు జీవోస్ లో లేరు అని అంటున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు పరిస్థితి అయోమయ స్థితిలో ఉన్నారు.. ఈరోజు మంత్రిమండలి జరుగుతుంది ఇందులోనైనా వాలంటీర్ల గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందేమో ఆశిద్దాం..
వాలంటీర్లకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడుకి అప్డేట్స్ ఇస్తాము…
డైలీ న్యూస్ పేపర్ ఫ్రీ గా చదివేయండి
📢 Related TAGS
ap volunteers, ap volunteers protest, ap volunteer, volunteers, ap volunteers news, ap volunteers latest news, ap volunteer latest news, ap volunteers protest against ap govt in vijayawada, ap volunteers fires on pawan kalyan, ap volunteers, grama volunteers, volunteers protest
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇