Ap Cabinet Meeting Updates తల్లికి వందనం పైన కీలక నిర్ణయం!

Ap Cabinet Meeting Updates

Ap Cabinet Meeting Updates తల్లికి వందనం పైన కీలక నిర్ణయం!

Ap Cabinet Meeting Updates :: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.. అవి ఎంటో పూర్తిగా చూదం! మరిన్ని అప్డేట్స్ కి మా వాట్సప్ గ్రూప్ ఫోలో అవ్వగలరు.

WhatsApp Group Join Now

నేటి(02 జనవరి) కేబినెట్ నిర్ణయాలు

✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

✓ కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

✓ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

✓ రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై కేబినెట్ మీటింగ్ లో చ‌ర్చించారు.

✓ అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చ‌ర్చ జ‌ర‌గింది.

NTR Bharosa pension update
NTR Bharosa Pension Update : రాష్ట్రంలో పెన్షనర్ల అందరికీ ఈ పని తప్పనిసరి ఆదేశాలు జారీ

✓ నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

✓ ఎస్‌ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెల‌పింది. ఈ పెట్టుబడులు వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

✓ నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్న‌ల్. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది.

✓ మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు.

Also Read :: మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్లు పంపిణీ

✓ విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

✓ శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిల‌కు క్యాబినెట్ ఓకే చెప్పింది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలుగనుంది.

✓ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు , ది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..

Today News 2025
Today News 2025: ఈరోజు వరకు వచ్చిన లేటెస్ట్ న్యూస్

✓ వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చర్చించడం జరిగింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’

తల్లికి వందనం పథకంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కీం అమలు చేయాలని చర్చించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో తెలిపింది.

Also Read :: రైల్వేలో 32,000 వేల ఉద్యోగాలు రిలీజ్ 

మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు

ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ. 10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.

📢 Related TAGS 

ap cabinet meeting today, cabinet meeting, ap cabinet meeting live, ap cabinet key meeting, andhra pradesh cabinet meeting, cm chandrababu cabinet meeting, ap cabinet meeting highlights, cm jagan cabinet meeting, ap cabinet meeting update, ap cabinet, cabinet meeting visuals, ap news updates, ap cabinet meeting today | cm chandrababu, cabinet meeting updates, 10tv latest updates, ap cm cabinet meeting

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now