Today News 2025: ఈరోజు వరకు వచ్చిన లేటెస్ట్ న్యూస్
Today News 2025 :: ఈ పేజీలో మనము ఈరోజు వరకు వచ్చిన అన్ని రకాల లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ పేజీలో నేను మీకు అందిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో సంప్రదించవచ్చును..
శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.
వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ
వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.
Also Read :- ఏపీ లో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్
దేశంలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ కేసులు
భారత్‌లో ఒక్కరోజే 6 హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV పాజిటివ్ అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి, చెన్నైలో ఇద్దరు చిన్నారులకు, HMPV పాజిటివ్ కరోనా వైరస్ కంటే ప్రమాదమంటున్న వైద్యులు.
Morning Top9 News
- KTRను విచారించేందుకు మరో తేదీ ప్రకటిస్తామన్న ఈడీ
- ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్న సర్కార్
- ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్, నిలిచిపోయిన ఓపీ సేవలు
- ఈ నెల 9న తెలంగాణలో కొత్త ఇంధన పాలసీ ప్రకటన
- HMPV వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
- అసోం బొగ్గుగనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులు
- ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడిని ఖండించిన భారత్
- బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
- స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ 9కి వాయిదా వేసిన ఇస్రో
Also Read :- నిరుద్యోగులకు జాబ్స్ రిలీజ్ ( Dont Miss Notification )
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇