ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్: PMAY 2.0 Scheme

PMAY 2.0 Scheme

Table of Contents

WhatsApp Group Join Now

ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్: PMAY 2.0 Scheme

PMAY 2.0 Scheme :: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు లేని వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును.. ఎలా అప్లై చేయాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం.. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

What is PMAY 2.0 Scheme?

ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్ ( PMAY -U ) 2.0కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గృహ నిర్మాణ పథకం కింద ఒక కోటి పట్టణ పేద మరియు మద్దతు తరగతి కుటుంబాలకు సహాయం చేస్తుంది.. ఐదేళ్లలో ( 2024-25 నుండి 2028-29 వరకు ) ప్రజలకు ఉచితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్హత 2025 ( PMAY )

గృహ నిర్మాణ & పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ప్రకారం PMAY పథకం కింద లబ్ధిదారుల అర్హత పొందాలంటే తప్పకుండా ఈ అర్హతలు కలిగి ఉండాలి.

  • PMAY లబ్ధిదారుడు భర్త, భార్య మరియు వారి అవివాహిత కుమార్తెలు/ కుమారులు కావచ్చు.
  • లబ్ధిదారుడు పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు.
  • మరియు ఆ ఇల్లు అతని / ఆమె పేరు మీద లేదా భారతదేశమంతటా కుటుంబంలోని మరే ఇతర సభ్యుడు పైన ఉండకూడదు.
  • వివాహితులు లేదా అవివాహితులు ఎవరైనా పెద్దవారైనా, వారిని పూర్తిగా ప్రత్యేక గృహంగా పరిగణించవచ్చును.
  • మీ కుటుంబంలోని రేషన్ కార్డులోని సభ్యులలో ఎవరికి ఇంతవరకు గృహం వచ్చి ఉండకూడదు..

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

ప్రజలందరికీ ముఖ్య గమనిక “సొంత స్థలము కలిగి ఉండి, గృహము కట్టు కొనుటకు సిద్దముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారుకి ఇప్పుడు ఆప్షన్ రావడం జరిగింది.. ఈ అవకాశం ఎవరు వదులుకోవద్దు.. అర్హులైన వారు తప్పకుండా ఈ గృహాలకి అప్లై చేసుకోండి.

PMAY 2.0 ఎలా అప్లయ్ చెయ్యాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ గ్రామ/ వార్డు సచివాలయ కార్యాలయము నందు వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ / వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను సంప్రదించి మీ కొత్త ఇంటికి దరఖాస్తుచేసుకొనవచ్చును. అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.

PMAY 2.0 కావలసిన డాక్యుమెంట్స్?

కొత్త ఇంటికి అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతి లబ్ధిదారునికి ఈ క్రింద తెలిపిన పత్రముల జిరాక్స్ కాపీలు మరియు ”4బి” అప్లికేషన్ ఫామ్ ను గ్రామ వార్డు సచివాలయంలో మీరు అందించాలి.

Free Sewing Machines మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు..
  • అర్జీదారురాలు మరియు వారి భర్తతో కలిసి ఉన్న ఫోటో విధిగా అర్జీకి అతికించవలెను.
  • ఆదాయ ధృవీకరణ పత్రము
  • రేషన్ కార్డు, కరెంట్ బిల్,హౌస్ టాక్స్ బిల్ కాపీ.
  • ఓటరు ఐ.డి. కార్డ్
  • కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డుల నకళ్ళు .
  • కుల ధృవీకరణ పత్రం
  • వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొదటి పేజి (ఆధార్ అనుసంధానం అయివుండాలి.)
  • ఇంటిపట్టా లేదా సొంత ఇంటి స్థల డాక్యుమెంటు లేదా పొసెషన్ సర్టిఫికేట్,.
  • అంగవైకల్యము ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్ మొదలగునవి జిరాక్స్ కాపీలు అర్జీకి జతపరచవలెను. జిరాక్స్ కాపీల నందు అర్జీ దారుని సంతకం చేయవలెను.

గమనిక :: OTP కొరకు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింకు అయ్యి వినియోగం లో ఉండి వుండాలి. ( తప్పకుండా అప్లై చేసి అభ్యర్థికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. )

Also Read :: పోస్ట్ ఆఫీస్ లో 40,000 వేల ఉద్యోగాలు రిలీజ్ ( 10th అర్హతతో )

PMAY 2.0 కి లాస్ట్ డేట్ ఎప్పుడు?

సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం 30.01.2025 లోపు అర్హులైన వాళ్ళందరూ గ్రామ/ వార్డు సచివాలయం కు వెళ్లి అప్లై చేసుకోండి.

Note :: ఒక వేళ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం డేట్ పెంచితే మన వాట్సాప్ గ్రూపులో అప్డేట్ ఇస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చును.అర్హులైన వారందరూ ఈ అవకాశమును సద్వినియోగ పరుచుకోవలెనని తెలియజేయడమైనది.

PMAY లబ్ధిదారుల జాబితా లో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

SECC 2011 డేటా ఆధారంగా ప్రభుత్వం వార్షిక లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తుంది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన జాబితాలో మీ పేరు తనిఖీ చేయడానికి స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • PMAY లబ్ధిదారుల జాబితా వెబ్సైట్ ను సందర్శించండి. ( PMAY gov in )
  • మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయండి.
  • మీ స్టేటస్ ను తెలుసుకోవడానికి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన – ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి పథకాలలో గ్రామీణ చాలా ముఖ్యమైనది. మీరు ఈ పథకం కింద ఇల్లు పొందాలని చూస్తున్నట్లయితే మరి మీరు అర్హులు అయితే వార్షిక లబ్ధిదారుల జాబితాను ట్రాక్ చేయండి.
  • మీకు సంబంధించిన లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోండి.

Also Read :- స్టేట్ బ్యాంకులో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ రిలీజ్

ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే?

Ap లో ఐతే డైరెక్ట్ గా మీరు ఎక్కడైతే అప్లై చేసారో ( గ్రామ వార్డు సచివాలయం ) కు వెళ్తే అక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది.. మీకు ఇంకా ఏమైనా మరింత సమాచారం కావాలంటే అక్కడున్న అధికారులను అడిగితే మీకు తెలపడం జరుగుతుంది.

Pm kisan 19th installment
PM Kisan 19th Installment లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన సారాంశం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా భారత ప్రభుత్వం చాలా మంది ప్రజల కలలను నెరవేర్చింది. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చింది. ఈ గృహాలను 4041 శాసన పట్టణాలు మరియు 500 టైర్ 1 మరియు 2 నగరాలలో నిర్మించబడ్డాయి. పథకాన్ని మరింత విస్తరించడానికి ప్రభుత్వం PMAY 2.0 నీ ప్రవేశపెట్టింది.

ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇల్లు నిర్మించబడతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీం ద్వారా ఎంతోమంది ఇల్లు లేని నిరుపేదలు లబ్ధి పొందుతారు. ముగింపు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లోకి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీతోటి మిత్రులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

మరిన్ని విద్య ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here

ఈ స్కిమ్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి డౌట్స్ క్లియర్ చేసుకోండి.

📢 Related Tags

play 2.0 interest subsidy scheme, housing scheme, pmay 2.0, pmay scheme, pmay 2.0 scheme, pmay urban 2.0 scheme, government schemes 2025, interest subsidy scheme, pm awas yojana urban 2.0, pmay 2.0 urban, play 2.0 subsidy, government scheme, how to apply pmay 2.0 home loan scheme, government schemes

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index