Ap Govt Students Good News విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక
Ap Govt Students Good News :: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వచ్చే యేడాది జనవరి 1వ తేదీ నుంచి డొక్కా సీతమ్మ బడి భోజనం పథకం కింద ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం!
ఈ నెల 3వ తేదీన పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.
అయితే ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారో ప్రకటించలేదు. ప్రస్తుతం హైస్కూల్ ప్లస్ పేరిట ఉన్న జూనియర్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలలు గా మార్పు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం లోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారని అంతా భావించారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read :: తల్లికి వందనం స్కీం లేటెస్ట్ అప్డేట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచితంగా స్టూడెంట్ కిట్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ యేడాది తొలిసారి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.
అలాగే ఇప్పటి వరకు 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ శాల స్థాయిలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేయనున్నారు.
Ap Cabinet ఆమోదం
475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం అమలుకు నిధులు కేటాయింపునకు క్యాబినెట్ లో పరిపాలన అనుమతి.
Full Details :: Click Here
ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని హైస్కూళ్ల నుంచి మధ్యాహ్న భోజనం పంపనున్నారు. అలాగే పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు తో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించనున్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇