Ap Job Calander 2025 రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరికీ గుడ్ న్యూస్
Ap Job Calander 2025 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది.. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
Ap Job Calander Announced 2025
- కొత్తగా 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీపై ప్రకటన
- అటవీ శాఖలో అత్యధికం
- పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల డేట్స్ వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఉద్యోగాల భర్తీకి ఎన్డీయే ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా ‘జాబ్ క్యాలెండర్ ‘ను విడుదలకు చర్యలు తీసుకుంటుంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ గురించి, ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది.
కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలో నే 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తికానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
కొత్త నోటిఫికేషన్ల వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేయబోయే జాబ్స్ నోటిఫికేషన్స్ క్రింది విధంగా ఉన్నాయి..
- అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ – 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)
- బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు 691 (క్యారీఫార్వర్డ్-141- అటవీశాఖ )
- డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్ -2- టెక్నికల్ అసిస్టెంట్ (అటవీ శాఖ) – 13
- ఠాణేదార్ (అటవీ శాఖ) – 10
- మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ – 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ – 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ – 4 ( 11 )
- అగ్రికల్చర్ ఆఫీసర్ ( వ్యవసాయ శాఖ ) – 10
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ ) – 7
- జిల్లా సైనిక్ ఆఫీసర్ – 7
- గ్రంథ పాలకులు (ఇంటర్ విద్య) – 2
- హార్టీ కల్చర్ ఆఫీసర్ (ఉద్యానవన ) – 2
- అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యశాఖ) – 3
- టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల ) – 4
Also Read :: రైల్వే శాఖలో 32,000 వేల ఉద్యోగాలు రిలీజ్
ఇతర పోస్టుల వివరాలు
దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్, గనుల శాఖ- రాయల్టీ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్- టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది.
ఏప్రిల్ తర్వాత గ్రూప్-1 ప్రధాన పరీక్షలు
గ్రూప్-1 ప్రధాన పరీక్షలను (నోటిఫికేషన్ 11/2023) 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల కు రాత పరీక్షలను 2025 జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది.
డైలీ న్యూస్ పేపర్ ఫ్రీ గా చడివేయండి
📢 Related TAGS
ap job calendar 2025, appsc job calendar vacancy list 2025, appsc job calendar 2025, appsc job calendar 2025 vacancy list, ap job calendar vacancy list in telugu 2025, appsc job calendar in telugu 2025, appsc job calendar notification 2025, ap job calendar, ap job calender 2025, ap job calendar 2024, appsc job calendar 2024, ap job calendar 2021, ap forest beat officer notification 2025, ap upcoming jobs in telugu 2025,appsc job callender 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇