H
Ap Peoples Good News : ప్రతి గ్రామానికి రెవెన్యూ సదస్సులు!
Ap Peoples Good News :: ఈ రెవెన్యూ సదస్సులు అంటే ఏమిటి అనుకుంటున్నారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలోని ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీ గ్రామంలోని భూ సమస్యలన్నీ మీ ముందునే పరిష్కరించడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు తీసుకురావడం జరిగింది..
రెవెన్యూ సదస్సులో ఏం చేస్తారు?
1. గ్రామ రెవెన్యూ మ్యాప్ను, ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్లను ప్రకటిస్తారు.
2. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్త్ర శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు.
3. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసుల పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, ల్యాండ్ గ్రాబింగ్, నిషిద్ధభూముల 22(ఏ) జాబితా నుండి భూములు తొలగింపు వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు.
Also Read :- తల్లికి వందనం స్కీం రూ. 6,485 కోట్లు రిలీజ్
4. ఎస్.ఎల్.ఆర్, అడంగల్, ఆర్ఆర్, 1-బి రిజిస్టర్, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు.
5. వాటిపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలనచేస్తారు.
6. పై పిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వీటిని ఆర్టీజీఎస్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే రశీదు ఇస్తారు.
🌧️ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు(డిసెంబర్ 19) కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
రెవిన్యూ సదస్సుల్లో జరిగే ముఖ్య కార్యక్రమాలు – ప్రజల సమస్యల పరిష్కారం ఎలా?
Also Read :- ఆడబిడ్డ నిధి స్కీమ్ ఫుల్ డీటెయిల్స్
- భూ కొలతల్లో తేడాలు
- సర్వే నెంబర్లలో మార్పులు
- వారసుల పేర్ల నమోదు
- సరిహద్దు సమస్యలు
- రీసర్వే చేసిన గ్రామాల్లో తప్పుల నిర్ధారణ
- భూకబ్జాలు, ఆక్రమణలు
- నిషిద్ధ భూముల 22(ఏ) జాబితా నుండి భూముల తొలగింపు
గమనిక :: ఎప్పటి నుంచో భూ సమస్యల మీకు ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రెవెన్యూ సదస్సును ఉపయోగించుకొని మీ సమస్యలు పరిష్కరించుకోగలరు..
Also Read :- త్వరలో రైతులకు రూ.20,000 వేలు
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇