పది పాసైన అమ్మాయిలకు నెలకు రూ.1000 ఇలా అప్లై చేయండి: CBSE Single Girl Child Scholarship
పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలు కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ ( CBSE Single Girl Child Scholarship ) స్కీం రూపొందించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రతినెల రూ. 1,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీకు మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
CBSE Single Girl Child Scholarship 2025
పేద పిల్లలతో పాటు అమ్మాయిలను చదువుల్లో ముందు ఉంచాలని సంకల్పంతో ప్రభుత్వం పలు కీలక పథకాలు అమలు చేస్తోంది. వాటిల్లో ముఖ్యమైన పథకమే ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ రూపొందించారు. ఇప్పటికే స్కీం కింద అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే చూద్దాం.
Full Details of CBSE Single Girl Child Scholarship
స్కాలర్షిప్ పేరు | CBSE Single Girl Child Scholarship |
ఎవరు ప్రారంభించారు | CBSE |
అర్హులు | తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్ల |
ఉద్దేశం | ఉన్నత విద్యను అందించడానికి |
ప్రయోజనాలు | బాలికలు విద్యారంగంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి |
కనీస మార్కుల అవసరం | 10వ తరగతి పరీక్షలో 60% మార్కులు ఉండాలి |
అప్లికేషన్ ప్రాసెస్ | ఆన్లైన్ లో అప్లై చెయ్యాలి |
అఫీషియల్ వెబ్సైట్ | CBSE సింగల్ గర్ల్ చైల్డ్ |
ఆర్థికంగా ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవలేక, తమ తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత బాగా లేక పోవడం వలన తమ చదువులను అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. మరియు దీని వల్ల సమాజంలో ఉన్నత స్థానాలలో తక్కువ మంది మహిళలు రాణిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వారి తల్లిదండ్రుల ఒంటరిగా ఉన్న ఆడపిల్లలకు వారి ఉన్నత చదువులు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ స్కాలర్షిప్ సహాయంతో, విద్యార్థులు ఎటువంటి ఆర్థిక అడ్డంకుల గురించి ఆలోచించకుండా వారి కలల లక్ష్యాలను సాధించగలుగుతారు.
Also Read :- 10తో రైల్వేలో ఉద్యోగాలు రిలీజ్
అర్హతలు
- ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆడపిల్ల తన తల్లిదండ్రులకు ఒకే కుమార్తె అయ్యి ఉండాలి.
- ఈ పథకం కింద భారతదేశంలోని విద్యార్థులు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు.
- CBSE లో పదో తరగతి లో 60% తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో CBSE అనుబంధ విద్యా సంస్థల్లో 11వ తరగతి చదువుతూ ఉండాలి.
- NRI దరఖాస్తుదారులు కూడా ఈ పథకం కింద స్కాలర్షిప్ కి అర్హులు.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి.
ఇప్పటికే ఈ స్కీం కింద స్కాలర్షిప్ అందుకుంటున్న విద్యార్థినిలు 12వ తరగతిలో రెన్యువల్ చేసుకోవాలంటే 11వ తరగతిలో 50% మార్కులు సాధించి ఉండాలి.
స్కాలర్షిప్ అమౌంట్
- ఈ స్కాలర్షిప్ కి అర్హులైన స్టూడెంట్స్ కి నెలకి రూ. 1,000 /- చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందిస్తారు.
ముఖ్యమైన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డ్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు ఖాతా వివరాలు
- ప్రవేశ రుజువు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- విద్యార్థుల గుర్తింపు కార్డు
CBSE Single Girl Child Scholarship Important Date’s
Last Date of Online Application Submit ( Fresh Application ) | 8th February 2025 |
Verification of Application by Schools ( Fresh Application ) | 15th February 2025 |
Last Date of Online Application Submission ( Renewal Application ) | 8th February 2025 |
Verification of Application by Schools ( Renewal Application ) | 15th February 2025 |
అప్లై ప్రాసెస్
ఈ స్కాలర్షిప్ కి సంబంధించి పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా లేక పోతే నెట్ సెంటర్స్ నుండి అప్లై చేసుకోవచ్చును.
CBSE పబ్లిక్ నోటీసు | Click Here |
Online Apply Link | Click Here |
Latest Jobs | Click Here |
📢 Related Tags
single girl child scholarship, cbse single girl child scholarship, cbse single girl child scholarship scheme, scholarship for single girl child, how to apply for single girl child scholarship, cbse single girl child scholarship application form, scholarship for girls, scholarship scheme for single girl child, single girl child scholarship eligibility, cbse merit scholarship for single girl child, scholarship, cbse scholarship
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇