Loans for Women: 50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలు లోన్స్ పొందొచ్చు
Loans for Women : మనదేశంలోని పేద మరియు మధ్యతరగతి మహిళను ఆదుకునేందుకు ఎన్నో రకాల లోన్స్ అయితే ఉన్నాయి. ఆ లోన్స్ ఎలా అప్లై చేయాలి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
Highlights of the Loans for Women
మహిళలు స్వయం శక్తిగా ఎదగడానికి మరియు ఆర్థికంగా నిలబడడానికి భారత ప్రభుత్వం మహిళల కోసం అనేక ఆర్థిక పథకాలను ప్రవేశపెడుతుంది. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడానికి అత్యంత ముఖ్యమైన వాటి లలో ఒకటి మహిళా కేంద్రీకృత రుణ పథకాలను ప్రవేశపెట్టడం. అవేంటో చూద్దాం
- Business loans ( వ్యాపార రుణాలు )
- Marriage loans ( వివాహం రుణాలు )
- Home loans ( గృహ రుణాలు )
ఇప్పుడు పైన చెప్పిన లోన్స్ మహిళలకు అత్యంత ప్రాధాన్యతమైనవి. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Business loans ( వ్యాపార రుణాలు )
మనదేశంలో పేద మరియు మధ్య తరగతిలో అనేక పరిశ్రమలు అనేవి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో MSME పర్యావరణ వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. ఇటీవల చేసిన సర్వేల ప్రకారం, మన భారతదేశం పరిశ్రమల ప్రకారం చాలా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. ఇలా అభివృద్ధి చెందిన వారిలో సుమారు 13.76% మంది పారిశ్రామికవేత్తలు మహిళలే. ఇలా మహిళలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు కానీ మరి కొందరు మహిళలు వారి వ్యాపారాలను ప్రారంభించడానికి ముందుకు రావడం లేదు దీనికి గల కారణం వారి యొక్క ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం. ఇలా ఆర్థికంగా వెనుకబడిన మహిళలను మన దేశ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వారి వెనక ఉండి వారిని ఆర్థికంగా అభివృద్ధి మార్గంలో ప్రయాణించడానికి మన ప్రభుత్వాలు మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. అయితే ఏ పథకం కింద ఎంత లోన్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Schemes and Loans For Women’s :
Scheme | Total Loan |
Mudra Yojana Scheme | రూ.50,000 నుండి రూ.50 lakhs |
Mahila Udyam Nidhi Scheme | Up to రూ.10 lakhs |
Bharatiya Mahila Business Bank Loan | Up to రూ.20 crores |
Annapurna Scheme | Up to రూ.50,000 |
Cent Kalyani Scheme | Up to రూ.1 crore |
Udyogini Scheme | Up to రూ.1 lakh |
Stree Shakti Package | రూ.50,000 నుండి రూ.50 lakhs |
Dena Shakti Scheme | Up to రూ.20 lakhs |
Mudra Yojana Scheme :
ఈ పథకం ద్వారా మహిళలు వారి యొక్క స్కిల్స్ బట్టి ట్యూషన్ సెంటర్, టైలరింగ్ లేదా బ్యూటీ పార్లర్ వంటి వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం మహిళలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించడం. ఈ పథకం ద్వారా మహిళలు రూ.50,000 నుండి రూ.50 lakhs వరకు రుణాలు పొందవచ్చు.
ఈ పథకాన్ని ప్రభుత్వం ఒకేసారి కాకుండా మూడు ప్రణాళికల ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
- స్టార్టప్ ల కోసం Shishu Plan(రూ.50,000 వరకు రుణాలు)
- దృఢంగా స్థిరపడిన సంస్థల కోసం Kishor Plan(రూ.50,000 నుండి 5 lakhs వరకు రుణాలు)
- వ్యాపారాల కోసం Tarun Plan(రూ.5 నుండి రూ.10 lakhs వరకు రుణాలు)
ముద్ర యోజన లోన్ అప్లయ్ చేయు లింక్ :: Click Here
Mahila Udyam Nidhi Scheme :
ఈ పథకం ద్వారా మహిళలు సులభంగా 10 లక్షల దాకా రుణం పొందవచ్చు. ఈ పథకాన్ని SIDBI( స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మహిళలకు అందజేస్తుంది. ఈ పథకం కింద 10 లక్షల రూపాయలు మహిళలకు అందజేస్తారు వారు ఏదైనా ఒక చిన్న స్టార్టప్ లాంటి వాటితో వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని మెరుగు పరుచుకోవచ్చును. ఈ పథకం కింద తీసుకున్న రుణాన్ని రీ పేమెంట్ చేయడం కోసం ప్రభుత్వం పది సంవత్సరాలు సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానితోపాటు ఐదు సంవత్సరాలు మారటోరియం పీరియడ్ కూడా ఉంటుంది. ఈ రుణానికి వడ్డీ కూడా మార్కెట్ రేట్లకు లోబడే ఉంటుంది.
Mahila Udyam Nidhi Scheme Official Website :: Click Here
Bharatiya Mahila Business Bank Loan :
ఈ పథకం కింద మహిళలు చాలా ఎక్కువ మోతాదులో రుణాలు పొందవచ్చు. అయితే మహిళలు వారి యొక్క బిజినెస్ కేటగిరీ దాన్ని బట్టి ప్రభుత్వం రుణాలు లను ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న పరిశ్రమల కోసం రూ.1 కోటి వరకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ద్వారా వీరు రుణాలు పొందవచ్చు. పెద్ద పరిశ్రమల కోసం అయితే మాన్యుఫాక్చరింగ్ ఎంటర్ప్రైజ్స్ కేటగిరి కింద రూ.20 కోట్ల దాకా రుణం పొందవచ్చు. మహిళలు ఈ తీసుకున్న రుణాలను ఏడు సంవత్సరాల సమయంలోగా తిరిగి లోన్ రీ పేమెంట్ చేయవలెను.
భారతీయ మహిళ బిజినెస్ బ్యాంకు లోన్ అప్లై చేయు లింక్ :: Click Here
Annapurna Scheme :
ఈ పథకం ద్వారా మహిళలు రూ.50,000 వరకు రుణాలను పొందవచ్చు. అయితే ఈ పథకం ఎవరైతే మహిళలు ఫుడ్ క్యాటరింగ్ లాంటి వ్యాపారాలు చేస్తున్న మహిళలు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. వంట సామాన్లు, వంట పాత్రలు అలాగే వంటకి గదికి సంబంధించిన పరికరాలను ఈ రుణం తో కొనుగోలు చేయవచ్చు. ఈ అన్నపూర్ణ పథకం ద్వారా మహిళలు రుణం పొందాలంటే కచ్చితంగా గ్యారెంటర్ యొక్క అవసరం ఉంటుంది. తద్వారా మహిళలు సులభంగా ఈ పథకాన్ని పొందవచ్చు.
అన్నపూర్ణ స్కీమ్ అఫీషియల్ వెబ్సైట్ :: Click Here
Cent Kalyani Scheme :
ఈ పథకం ద్వారా మహిళలు రూ.1 కోటి వరకు రుణాన్ని పొందవచ్చు. మహిళలు వారి యొక్క స్వయంకృషి ద్వారా ఎదగాలని ప్రభుత్వం మహిళలను ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ వ్యవసాయ మరియు రిటైల్ పరిశ్రమలలో పురుషులతో పాటు మహిళా వ్యాపార యజమానులు కూడా ఉండాలని మహిళా వ్యాపార యాజమానుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని మహిళలకు అందజేస్తుంది. ఈ పథకం పొందేందుకు మహిళలు ఎటువంటి గ్యారెంటర్ సహాయం అవసరం లేదు. ఈ రుణానికి వడ్డీ రేట్లు కూడా మార్కెట్ రేట్లకు లోబడే ఉంటుంది.
Cent Kalyani Scheme Apply Link :: Click Here
Udyogini Scheme :
ఈ పథకం ద్వారా మహిళలు రూ.1 లక్ష వరకు పొందవచ్చు. అయితే ఈ పథకాన్ని పొందాలంటే మహిళలకు వారి యొక్క వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ ఉద్యోగిని స్కీం కోసం అప్లై చేసుకునే మహిళల సంవత్సర ఆదాయం రూ.45,000 రూపాయల కంటే తక్కువ ఉండాలి. అయితే వికలాంగులకు మరియు వితంతువులకు, నిరుపేదలకు ఆదాయంలో ఎటువంటి పరిమితి ఉండదు. అందువలన వీరు మాత్రం వారి యొక్క ఆదాయం ఎంత ఉన్నా ఈ స్కీం కి ఎలిజిబుల్ అవుతారు.
Udyogini Scheme Official Website :: Click Here
Stree Shakti Package :
మీకు సంబంధించి ఏదైనా సరే మీరు బిజినెస్ చేసేటప్పుడు 50% కంటే ఎక్కువ వాటా మీకు గనక ఉన్నట్లయితే ఈ స్కీం ద్వారా మహిళలకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉన్న రుణాలపై 0.05% వడ్డీ రాయితీని పొందవచ్చు.
Stree Shakti Package Official Website :: Click Here
Dena Shakti Scheme :
ఈ పథకం ద్వారా మహిళలు రూ.20 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. చిన్న వ్యాపారాలకు, చిన్న సంస్థలకు, తయారీ, క్రెడిట్, మైక్రో-క్రెడిట్,రిటైల్ దుకాణాల కోసం ఈ పథకం ద్వారా రూ.50,000 వరకు పొందవచ్చు. అలాగే వ్యవసాయ వ్యాపార కోసం అయితే రూ.20 లక్షల వరకు రుణాలు మహిళలు పొందవచ్చు.
Dena Shakti Scheme Official Website :: Click Here
నావి లో 10 తరగతితో ఉద్యోగాలు : Click Here
Marriage Loans
మహిళల కోసం వివిధ రంగాలలో వివిధ బ్యాంకులు అతి తక్కువ వడ్డీతో మహిళలకు వివాహ రుణాలు అందజేస్తాయి.
అయితే ఏ బ్యాంకు ఎంత రుణాలు అందజేస్తాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Bank | Total Loan Amount | Interest |
Axis Bank | రూ.50,000 నుండి రూ.15 లక్షలు | 12%-24% |
Indiabulls Dhani | రూ.1000 నుండి రూ.15 లక్షలు | 13.99% |
Tata Capital | రూ.75,000 నుండి రూ.25 లక్షలు | 10.99% |
ICICI Bank | Up to రూ.20 లక్షలు | 11.25% |
Axis Bank Loan :
యాక్సిస్ బ్యాంక్ ద్వారా మహిళలు సుమారు రూ.50,000 నుండి రూ.15 లక్షల రూపాయల దాకా వివాహ రుణాలు పొందవచ్చు. ఈ రుణాల కోసం మహిళలు అప్లై చేసుకోవాలంటే వారి వయసు తప్పనిసరిగా 21 సంవత్సరాలు ఉండాలి. వివాహాల కోసం యాక్సిస్ బ్యాంక్ వ్యక్తిగతంగా రుణాలను ఇస్తుంది. ఈ రుణాలను 12 నెలల నుండి 60 నెలల మధ్య నుండి తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
Indiabulls Dhani :
దీని ద్వారా మహిళలు రూ.1000 నుండి రూ.15 లక్షల రూపాయల వరకు వివాహ రుణాలు పొందవచ్చు. మహిళలు ఈ రుణాన్ని పొందిన తర్వాత మీ అవసరాన్ని బట్టి లోన్ మొత్తాన్ని ఒకేసారి ఉపయోగించుకోవచ్చు.
Indiabulls Dhani ద్వారా మహిళలు వారి యొక్క వివాహం కోసం వివాహ రుణాన్ని చాలా తక్కువ సమయంలోనే పొందవచ్చు. మహిళలు ఈ రుణాన్ని పొందిన తరువాత 3 నెలల నుండి 36 నెలల మధ్యలో నుండి లోన్ రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది.
Tata Capital :
టాటా క్యాపిటల్ ద్వారా మహిళలు వివాహం కొరకు రూ.75,000 నుండి రూ.25 లక్షల రూపాయల వివాహ రుణాలను పొందవచ్చు. ఈ రుణాలను పొందిన తరువాత మహిళలు 12 నెలల నుండి 72 నెలల మధ్య కాల సమయంలో లోన్ రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ రుణాలను పొందేందుకు ఎటువంటి గ్యారెంటర్ అవసరం ఉండదు.
ICICI Bank :
ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా మహిళలు వివాహం కొరకు రూ.20 లక్షల దాకా వివాహ రుణాలు పొందవచ్చు. మహిళలు ఈ రుణాలను పొందిన తరువాత 12 నెలల నుండి 60 నెలల కాల పరిధిలో లోన్ రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది.ఐసిఐసిఐ బ్యాంక్ అందజేసే ఈ రుణాల వడ్డీ రేట్లు సంవత్సరానికి 11.25% నుండి 21.00% మధ్యలో వడ్డీ రేట్లు ఉంటాయి.
Home Loans
భారతదేశ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు గృహాలను కొనుగోలు చేసేందుకు గృహ రుణాలను అందజేస్తుంది. మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని మహిళలు కూడా వారి ఇంటిని వారే నిర్మించుకునే విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా రుణాలను ప్రవేశపెట్టింది.
PMAY(ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన) ప్రకారం స్త్రీ ఆస్తికి సహా యజమాని అయితే వారికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద గృహ కొనుగోలు చేసేందుకు గృహ కొనుగోలుదారులకు క్రెడిట్ సబ్సిడీ నీ ప్రవేశపెట్టింది. వెనుకబడిన మహిళలకు ఇది గొప్ప అవకాశం, కేంద్ర ప్రభుత్వమే వీరికి సబ్సిడీ పొందేందుకు అనుమతించింది. అయితే ఇది సమాజంలో ముఖ్యంగా వెనుకబడిన, ఆర్థికంగా బలహీన వర్గాల (EWS )వారికి అలాగే ఎవరైతే చాలా తక్కువ ఆదాయం వర్గాల (LIG) వారు ఉన్నారు వారికి చాలా చక్కటి అవకాశం. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం EWS,LIG వర్గాల మహిళలకు ఆర్థికంగా వారి గృహ నిర్మాణానికి సహాయంగా ప్రభుత్వం అతి తక్కువ వడ్డీల తో తాను వంతు సహాయం చేయాలని ప్రభుత్వం దీనిని ప్రారంభించింది.
ఒక మహిళల గృహ కొనుగోలుదారులకు తమ ఆస్తిపై తక్కువ మోతాదులో ది స్టాంప్ డ్యూటీ చార్జీలు ఉంటాయి. ఇది మహిళల వినియోగదారులకు ఒక చక్కటి అవకాశం. దాదాపు 1-2% మధ్యలో స్టాంపు చార్జీలు అనేవి ఆదా చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించుకొని మహిళలు వారి గృహ రుణం లో తక్కువ స్టాంప్ చార్జీలను పొందవచ్చు. ఏ విధంగా అయితే మహిళలకు బ్యాంక్ లు బిజినెస్ రుణాలు, వివాహ రుణాలు అందజేస్తూ ఉన్నాయో అదేవిధంగా మహిళల కోసం గృహ రుణాలను కూడా అందజేస్తూ ఉన్నాయి. అయితే ఏ బ్యాంక్ ఎంత రుణాలను, వడ్డీల ను ఇస్తూ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Bank | Total Loan Amount | Interest |
LIC HFL Home Loan | From రూ.15 లక్షలు | 7.40% |
State Bank of India Home Loan
|
Above రూ .75 లక్షలు | 7.75% |
HDFC Ltd.Home Loan | Above రూ.75 లక్షలు | 8.00% నుండి 8.50% |
Union Bank of India Home Loan | రూ.75 లక్షలు | 8.05% |
ICICI Bank Home Loan | రూ.5 లక్షల నుండి రూ.3 కోట్లు | 8.65% |
LIC HFL Home Loan :
ఈ LIC HFL Home Loan ద్వారా మహిళలు రూ.15 లక్షల నుండి గృహ రుణాలను పొందవచ్చు. ఈ రుణాన్ని పొందిన తర్వాత మహిళలు 5 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో తీసుకున్న రుణాలను చెల్లించవలసి ఉంటుంది. ఈ రుణాలకు వడ్డీ 7.40% p.a మధ్య ఉంటుంది. అందువలన మహిళలు ఈ గృహ రుణాన్ని చెల్లించడం కొంత సులభంగానే ఉంటుంది.
State Bank of India Home Loan :
ఈ State Bank of India Home Loan ద్వారా మహిళలు రూ.75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలు పొందవచ్చు. మహిళలు ఈ గృహ రుణాలు తీసుకున్న తర్వాత 1 సంవత్సరం నుండి 30 సంవత్సరాల మధ్యలో తీసుకున్న రుణాలను చెల్లించవలసి ఉంటుంది. ఈ రుణాలకు వడ్డీ రేట్లు 7.75% p.a వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ గృహ రుణాలను అందజేస్తూ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ గృహ రుణాలకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు కింద ఇవ్వబడినవి
- హోమ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ గా లభిస్తుంది
- ముందస్తు చెల్లింపు పెనాల్టీ అనేది లేదు
- రోజువారి తగ్గింపు బ్యాలెన్స్ పై వడ్డీ చార్జీలు
- దాచిన చార్జింగ్ లేవు
- తక్కువ ప్రాసెసింగ్ ఫీజు.
HDFC Ltd.Home Loan :
ఈ HDFC Ltd.Home Loan ద్వారా మహిళ రూ.75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలు పొందవచ్చు. ఈ గృహ రుణాలు తీసుకున్న మహిళలు 1 సంవత్సరం నుండి 30 సంవత్సరాల మధ్య లో ఈ గృహ రుణాన్ని రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ రుణాలకు వడ్డీ రేట్లు 8.00% నుండి 8.50% మధ్యలో వడ్డీ రేట్లు ఉంటాయి.
Union Bank of India Home Loan :
ఈ Union Bank of India Home Loan ద్వారా మహిళలు రూ.75 లక్షల వరకు గృహ రుణాలు పొందవచ్చు. మహిళలు ఈ రుణాన్ని పొందిన తరువాత దానిని 1 సంవత్సరం నుండి 20 సంవత్సరాల కాల వ్యవధి లో తిరిగి రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ గృహ రుణాలకు వడ్డీ రేట్లు 8.05% p.a. వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ రుణాలు కోసం భారతీయ మహిళల తో పాటు NRI లు కూడా అప్లై చేసుకోవచ్చు . ఈ గృహ రుణాన్ని పొందాలంటే మహిళలకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
ICICI Bank Home Loan :
ఈ ICICI Bank Home Loan ద్వారా మహిళలు 5 లక్షల నుండి 3 కోట్ల వరకు గృహ రుణాలను పొందవచ్చు. మహిళలు ఈ గృహ రుణాలను పొందిన తరువాత 3 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల కాల వ్యవధిలో లోన్ రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ గృహ రుణాలకు వడ్డీ రేట్లు 8.65% p.a వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.
🔻 Latest Govt Jobs :: Click Here
గమనిక :: ప్రతి రోజూ ప్రభుత్వ పథకాలు, లేటెస్ట్ జాబ్స్ కోసం మా సైట్ లేదా వాట్సప్ గ్రూప్ నీ ఫాలో అవ్వగలరు.
🔍 Related Tags
small business loans for women, business loans for women, small business loans, loans for small business, loans, small business loans for female minorities, loans for women business, small business grants for women, best business loans for women, business loans for black women, business loans for women small, loans business loans for women, women, business loans for women of color, small business grants for black women, loans for women to start a business
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇