
Table of Contents
💰 NSP Scholarship 2025
NSP Scholarship 2025 :: విద్యార్థులకు గుడ్ న్యూస్! NSP(నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్) ద్వారా ప్రతి ఏటా రూ.12,000 నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలోకి.. అయితే ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
🏆 NSP Scholarship 2025 – Overview
మన దేశంలో ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులను మరియు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు ఆర్థికంగా వారికి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ NSP(నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్) ను ప్రారంభించింది. దీనికి ప్రతి ఏటా ఎందరో విద్యార్థులు అప్లై చేసుకొని స్కాలర్షిప్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందుతున్నారు. అర్హులు అయిన విద్యార్థులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో ఈ స్కాలర్షిప్ డబ్బులను జమ చేస్తారు. అయితే ఈ అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది. అర్హత కలిగిన విదార్థులు అందరూ వెంటనే అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Name Of The Post | National Scholarship Portal (NSP) |
Official Website | scholarships.gov.in |
Eligibility | భారతీయ విద్యార్థులు (SC/ST/OBC/Minorities/General – poverty-based) |
Scholarships | Pre-Matric, Post-Matric, Merit-based, Minority Scholarships |
Benifits | స్కూల్ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకూ స్పాన్సర్‌షిప్ |
✅ Eligibility
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- విద్యార్థులు 9వ తరగతి, 10వ తరగతి/ఇంటర్మీడియట్ లో 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అయితే వారు చివరగా రాసిన సెమిస్టర్ పరీక్షల లో 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ.2,50,000 లోపు ఉండాలి.
📍NSP Scholarship 2025 Full Details
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి. విద్యార్థులు వారు అర్హత కలిగిన స్కీమ్ ను బట్టి అప్లై చేసుకోవాలి. అయితే ఈ స్కాలర్షిప్ కి ముఖ్యంగా అర్హులు ఎవరు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- 9వ తరగతి పాసైన విద్యార్థులు కూడా
- 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు
- ఇంటర్ పాస్ అయిన లేదా చదువుతున్న విద్యార్థులు
- గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు.
ఏ తరగతి వాళ్ళ అర్హులు | స్కాలర్షిప్ ద్వారా అందించే మొత్తం |
9వ తరగతి | రూ. 12,000 |
10వ తరగతి | రూ. 12,000 |
ఇంటర్ ఫస్టియర్ | రూ. 12,000 |
ఇంటర్ సెకండియర్ | రూ. 12,000 |
💰 Scholarship Amount
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క వివరాలను వెరిఫై చేసి అర్హత కలిగినట్లయితే వారిని ఈ స్కాలర్షిప్ కి ఎంపిక చేసి రూ.10,000 నుండి 20,000 వరకు విద్యార్థుల బ్యాంక్ ఖాతా లో జమ చేస్తారు.
💵 Application Fees
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజును చెల్లించవలసిన అవసరం ఉండదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చును. కాబట్టి అర్హత కలిగిన విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చును.
✅ ప్రయోజనాలు
- తక్కువ ఆదాయ గల కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక సహాయం
- విద్యాభ్యాసం కొనసాగించడంలో సహాయం
- స్కూల్ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకూ స్పాన్సర్‌షిప్
📝 Required Documents
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ముఖ్య డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card లేదా PAN Card
- Educational Certificates
- Student Bank Account Details
- Caste Certificate
- Income Certificate.
🖊️ How To Apply For NSP Scholarship 2025
Step 1 :: విద్యార్థులు ముందుగా NSP యొక్క అధికారిక వెబ్ సైట్ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 :: హోం పేజీలో మీకు Apply For Scholarship అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి.
Step 3 :: అక్కడ అడిగిన మీ మొబైల్ నెంబర్ వంటి వివరాలను చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయవలెను.
Step 4 :: మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ కు మెసేజ్ రూపం లో మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది.
Step 5 :: ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి “Aadhaar Face RD” మరియు “NSP OTR App” ను డౌన్లోడ్ చేసుకోండి.
Step 6 :: డౌన్లోడ్ చేసిన యాప్ లో లాగిన్ అయిన తర్వాత మీకు OTR id జనరేట్ అవ్వడం జరుగుతుంది.
Step 7 :: OTR ఐడి నీ NSP స్కాలర్షిప్ కి అప్లై చేసే సమయంలో ఎంటర్ చేయాలి.
Step 8 :: అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
✅ Important Link’s
పైన తెలిపిన స్కాలర్షిప్ కు సంబంధించి అప్లై చెయ్ లింకు పూర్తి వివరాలు కింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి..
🔥 అఫీషియల్ వెబ్సైట్ లింక్ | Click Here |
🔥 అప్లయ్ చేయు లింక్ | Click Here |
🔥 ప్రభుత్వ ఉద్యోగాల కోసం | Click Here |
❓ NSP Scholarship – Frequently Asked Questions (FAQ)
1. NSP Scholarship అంటే ఏమిటి?
NSP (National Scholarship Portal) అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం. దీనిలో విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే పలు స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
2. NSP Scholarship కోసం eligibility ఏంటి?
విద్యార్థులు భారతీయులై ఉండాలి. వారి కుటుంబ ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి. ఇది స్కీమ్‌ను బట్టి మారుతుంది – SC/ST/OBC/Minority students eligibility తక్కువ ఆదాయ పరిమితితో ఉంటుంది.
3. NSP Scholarship కు దరఖాస్తు ఎలా చేయాలి?
1. scholarships.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2. “New Registration” ద్వారా కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి.
3. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారం నింపండి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి Submit చేయండి.
4. NSP Scholarship కి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి?
ఆధార్ కార్డ్
విద్యాసంబంధిత సర్టిఫికెట్‌లు
ఆదాయ ధ్రువీకరణ పత్రం
బ్యాంక్ అకౌంట్ వివరాలు
కాస్ట్ సర్టిఫికెట్
5. NSP Scholarship లాస్ట్ డేట్ 2025 లో ఎప్పటివరకు ఉంటుంది?
ప్రతి సంవత్సరం NSP స్కాలర్‌షిప్ అప్లికేషన్లు జూన్ లేదా జూలైలో ప్రారంభమై, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ చివర వరకు అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన తేదీల కోసం అధికార వెబ్‌సైట్ చెక్ చేయండి.
6. NSP Scholarship Status ఎలా చెక్ చేయాలి?
1. scholarships.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2. “Login” సెక్షన్ లోకి వెళ్లి మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
3. “Check Your Status” బటన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు
7. Scholarship రిజెక్ట్ అయితే ఎందుకు అవుతుంది?
డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం
తప్పుడు సమాచారం ఇవ్వడం
Eligibility తీరకపోవడం
Duplicate application
8. Scholarship మన ఖాతాలోకి వస్తుందా?
అవును. NSP స్కాలర్‌షిప్ Direct Benefit Transfer (DBT) ద్వారా విద్యార్థి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా వస్తుంది.
🏷️ Related Tags
NSP Scholarship 2025, NSP Apply Online, NSP 2025 Last Date, NSP Status Check 2025, National Scholarship Portal, scholarships.gov.in, NSP Login 2025, NSP Fresh Application, NSP Renewal 2025, Central Government Scholarship, Pre Matric Scholarship 2025, Post Matric Scholarship 2025, Minority Scholarship 2025, SC ST OBC Scholarship 2025, NSP Documents Required, NSP Eligibility Criteria, NSP Payment Status, NSP Application Form 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇