NTR Aarogyasri Card Status 2025 మీ ఆరోగ్యశ్రీ కార్డ్ లో ఎంత మంది ఉన్నారో తెలుసుకోండి
NTR Aarogyasri Card Status 2025 :: వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు మీ మొబైల్ లోనే ఫ్రీగా మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు స్టేటస్ చెక్ చేసుకోండి. లేకపోతే ఎలా ఆడ్ చేయాలో కూడా చూద్దాం.. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
NTR Aarogyasri Card Status Overview
Name of the scheme | NTR Aarogyasri Card Status |
Launched by | Andhra Pradesh Government |
Objective | Card Status |
Beneficiaries | Andhra Pradesh State People’s |
Official Website | drntrvaidyaseva.ap.gov |
What is NTR Aarogyasri Card?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బీమా రూపంలో వైద్యం అందించడానికి ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డును తీసుకువచ్చారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా ప్రభుత్వం సూచించిన కొన్ని చికిత్సలకు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్ లో చేస్తారు. ఈ కార్డు ద్వారా కార్డులో ఉన్న ప్రతి సభ్యునికి ఆరోగ్యానికి అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
Also Read ::- ఫోన్ పే సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
How to Check My NTR Aarogyasri Card Status?
ప్రస్తుతం మనము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన మొబైల్ లోనే మన ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు. వారి వివరాలు సమగ్ర సమాచారం మన మొబైల్ లోని ఫ్రీగా తెలుసుకోవచ్చును. ఎలానో చెప్తాను ఈ క్రింది స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి.
Step 1 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన నెంబర్ కి ముందుగా మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయాలి. ( ప్రతి ఒక్కరు ఆ నెంబర్ మీ కాంటాక్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. )
Step 2 :: తర్వాత మీకు మన మిత్ర ( వాట్సాప్ గవర్నెన్స్ ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రులకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం ప్రజల చేతిలో ప్రభుత్వమని ఒక ఆర్టికల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సేవను ఎంచుకోండి. అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 :: తర్వాత మీకు దయచేసి ఒక సేవ ను ఎంచుకోండి. అని ఒక చిన్న box రావడం జరుగుతుంది. సింపుల్గా దానిపై మీరు క్లిక్ చేయాలి.
Step 4 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీకు అన్ని సర్వీసులు రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఆరోగ్యశ్రీ కార్డు సేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5 :: తర్వాత నిర్ధారించండి అనే బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింద చూపించిన విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.
Step 6 :: చెల్లించు అని బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవచ్చును, అలాగే మీ ఆరోగ్యశ్రీ కార్డును అప్డేట్ కూడా చేసుకోవచ్చును.
Step 7 :: చెల్లించు క్లిక్ చేయగానే ఆరోగ్యశ్రీ కార్డు అప్డేట్ చేయాలనుకుంటున్నారా.. లేదా మీ స్థితిని తెలుసుకోవాలనుకుంటున్నారా అని మీకు ఇంకో పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ నీ ఎలా తెలుసుకోవాలి చెప్తాను. స్టేటస్ పై క్లిక్ చేయండి.
Step 8 :: క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. తప్పకుండా మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న మెంబర్స్ లో ఎవరిదైనా సరే ఒకరిది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత ఈ క్రింద చెప్పిన విధంగా ఇమేజ్ వస్తుంది.
Step 9 :: ఆధార్ నెంబర్ చెక్ చేసుకుని ఆధార్ నీ నిర్ధారించండి పై క్లిక్ చేస్తానే మనకి సమర్పించండి అని ఒక బటన్ ఆన్ అవడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఆ బటన్ పై క్లిక్ చేయండి.
Step 10 :: అక్కడ మీరు మీకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు లేదా ఆధార్ కార్డు నెంబర్ పై ఎంచుకోండి.
Step 11 :: ఫైనల్ గా మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు, వారి పేరు వివరాలు, ఆధార్ కార్డు నెంబరు మరియు ఏజ్ అన్ని వివరాలు తెలుస్తాయి. మీకు అక్కడ ఏ నేమ్ వస్తే వాళ్ళవి మాత్రమే మీ ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్స్ ఉన్నట్టు అర్థం.
Step 12 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ని అందరిని కనిపిస్తాయి. ఈ క్రింద ఇచ్చిన నెంబర్ మీ మొబైల్ లో సేవ్ చేసుకొని మెసేజ్ చేసి మీ ఆరోగ్యశ్రీ కార్డు డీటెయిల్స్ తెలుసుకోండి.
వాట్సాప్ ద్వారా పౌర సేవల కోసం నెంబర్/ వాట్సాప్ లింక్ 👇👇
✓ 9552300009
HI అని మెసేజ్ చేస్తే.. సేవను ఎంచుకొనే ఆప్షన్ వస్తుంది.(రెవెన్యూ, ఆర్టీసీ, ఎనర్జీ, ఆరోగ్య కార్డు, పోలీసు శాఖ, పిర్యాదు పరిష్కరణ, CDMA,.. వంటి సేవలు కలవు).
విద్య ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
What is WhatsApp Governance Service’s
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ప్రవేశపెట్టిన ఈ వాట్సప్ గవర్నెన్స్ క్రింద తెలిపిన అన్ని సర్వీసులు సిటిజెన్స్ కి వాట్సాప్ లోనే అందుబాటులో ఉన్నాయి. అవి
- దేవాలయ బుకింగ్ సేవలు
- ఫిర్యాదులు పరిష్కరణ సేవలు
- APSRTC సేవలు
- ఎనర్జీ సేవలు
- సీఎం ఆర్ఎఫ్ సేవలు
- CDMA సేవలు
- రెవిన్యూ సేవలు
- ఆరోగ్య కార్డు సేవలు
- పోలీస్ శాఖ సేవలు
గమనిక :: పైన తెలిపిన సేవలను మీ మొబైల్ లోనే మీరు ఉపయోగించుకోవచ్చును. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ మీ మొబైల్ లో సేవ్ అయి ఉంటే చాలు.
NTR Aarogyasri Card Required Documents
ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేయాలంటే తప్పనిసరిగా క్రింద చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు
- కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో
- మొబైల్ నెంబర్
- పాత ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్స్ ( కొత్తగా యాడ్ చేయాలనుకున్న వాళ్ళని ఇందులో ఆడ్ చేయొచ్చు )
- అప్లికేషన్ ఫామ్
మరింత సమాచారం కొరకు మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.. Click Here
📢 People also ask
How do I check my Aarogyasri card status?
మీ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా పైనున్న పేజీలో అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి.
How do I get an Aarogyasri card online in AP?
మనము ఆరోగ్యశ్రీ కార్డు ని రెండు విధాలుగా పొందవచ్చును. ఒకటి వాట్సాప్ ద్వారా మరొకటి వచ్చేసి డైరెక్ట్ గా గ్రామ, వార్డు సచివాలయం ద్వారా పొందవచ్చును.
What is the limit of NTR Aarogyasri in Andhra Pradesh?
గత ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతమున్న ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అప్డేట్ లేదు.
ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ చెక్?
సింపుల్గా మీ మొబైల్ లోనే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ పైనున్న పేజిని మళ్ళీ ఒకసారి తనిఖీ చేయండి.
What is the maximum limit of Aarogyasri?
గత ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతమున్న ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అప్డేట్ లేదు.
How do I download my AP health card?
ప్రస్తుతానికి ఆన్లైన్లో ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదండి. డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయం వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇