PM Internship Scheme: యువతకు ప్రతి నెల రూ. 5,000 పీఎం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి

PM Internship Scheme

PM Internship Scheme: యువతకు ప్రతి నెల రూ. 5,000 పీఎం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి

PM internship Scheme :: నిరుద్యోగుల కి గుడ్ న్యూస్ పది పాస్ అయితే చాలు ఇంటర్న్షిప్. అయితే ఈ ఇంటర్న్షిప్ కి అర్హులు ఎవరు..ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ పేజీ లో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of PM Internship Scheme 2025

నిరుద్యోగం తో బాధపడుతున్న యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ స్కీం (PM Internship Scheme) ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి తో పాటూ వారి యొక్క స్కిల్స్ ను మెరుగు పరుచుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. విద్యార్థులు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు వారి యొక్క ఇంట్రెస్ట్ బట్టి వారికి నచ్చిన విభాగాలలో ఇంటర్న్షిప్ ను ఎంచుకోవచ్చు. అలాగే వారు ఈ ఇంటర్నెట్ షిప్ కి ఎలిజిబుల్ అవుతారో తెలుసుకొని వాటికి అప్లై చేసుకోవచ్చును.

Organization Ministry of Corporate Affairs, Government of India
Scheme Name PM Internship Scheme 2025
Benefits Rs 5,000 Monthly Stipend
Registration Last Date 15-April-2025
Application Fee No Application Fee
Partener Companies Top 500 Companies
Contact Us Call : 1800116090
Official Website https://pminternship.mca.gov.in/

Full Details About PM Internship Scheme

ఈ PMIS యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఒక ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడమే. లక్షల మందికి ఇంటర్న్షిప్ ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం నీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు వారికి నచ్చిన మరియు అవసరమైన స్కిల్స్ ను నేర్పించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసింది. యువత ఈ పరిశ్రమలతో కలిసి వర్క్ చేయడానికి ఈ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అలా విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడం వలన వారికి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలకు ఈ స్కిల్స్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడతాయి.

ఈ స్కీమ్ ద్వారా దాదాపు లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను అందిస్తుంది మొత్తం 327 కంపెనీ లు కాగా దీనిని అక్టోబర్ 3,2024 వ తేదిన ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించారు.

Eligibility :

ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలు పొంది ఉండాలి. అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
  • పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి
  • ఐటిఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చును.
  • కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  • ఈ అర్హతలన్నీ కలిగిన వారే ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు.

Also Read :- 7.55 లక్షల రేషన్ కార్డ్స్ రద్దు మీ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి

PM Internship Scheme Stipend Details

PM Internship Scheme కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం కొంత స్టైపెండ్ కూడా ఇస్తారు. అయితే ఈ స్టైపెండ్ ఎప్పుడు ఎంత ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

NSP Scholarship 2025
NSP Scholarship 2025: విద్యార్థులకు ఉచితంగా రూ.12,000 వేలు
  • శిక్షణ సమయంలో ప్రతినెలా రూ.5,000 రూపాయల స్టైపెండ్ ఇస్తారు
  • కంపెనీ లో చేరే ముందు రూ.6,000 రూపాయలు ఇస్తారు
  • ఒక్క సంవత్సరం మీకు మొత్తం రూ.66,000 రూపాయలు ఇస్తారు.

PM Internship Scheme కి ఎంపిక అయిన అభ్యర్థులకు శిక్షణలో భాగంగా ఏడాదికి ఆరు నెలలు ఫీల్డ్ లో ట్రైనింగ్ మరియు మిగతా ఆరు నెలలు క్లాస్ రూం శిక్షణ ఉంటుంది.ఈ ఇంటర్న్షిప్ లో ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తరుపున బీమా సౌకర్యం, పీఎం జీవన్ జ్యోతి బీమా వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఈ పథకాలకు కట్టవలసిన మొత్తం ప్రీమియం ను అభ్యర్థులు కట్టవలసిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది.

PM Internship Scheme Online Apply

Step 1 : మొదటగా ‘PM Internship Scheme’ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Step 2 : ఈ యాప్ ని ఓపెన్ చేసి మీ యూజర్ రిజిస్ట్రేషన్ ను కంప్లీట్ చేయండి. అందుకోసం అడిగిన డీటెయిల్స్ లైక్ Mobile Number,e-mail id, Aadhar Number లను ఎంటర్ చేసి వెరిఫై చేయవలెను.దాని తరువాత మీ పేరు,క్వాలిఫికేషన్ మరియు అడ్రీస్ ను ఎంటర్ చేయాలి.

Step 3 : యాప్ లో కి ఎంటర్ అయిన తర్వాత Internship Opportunities అని ఉండే విభాగాన్ని ఎంచుకొని ఓపెన్ చేయవలసి ఉంటుంది.

Step 4 : ఈ భాగంలో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ మరియు ఇంట్రెస్ట్ ను బట్టి మీకు ఏ ఇంటర్న్షిప్ కావాలో దానిని బ్రౌజ్ చేయాలి.

Step 5 : ఇక్కడ మీకు ఇష్టమైన ఇంటర్న్షిప్ ను క్లిక్ చేయాలి. ఆ తరువాత Apply Now బటన్ ను క్లిక్ చేయండి.

Step 6 : ఇప్పుడు మీరు ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.

ఈ ప్రాసెస్ నీ ఫాలో అయినట్లు అయితే మీ యొక్క అప్లికేషన్లు మీరే ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును.

  •  అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయినట్లయితే వారి యొక్క మొబైల్ కు నోటిఫికేషన్ వస్తుంది.
  • ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు మీరు అప్లై చేసిన కంపెనీ నుండి ఈమెయిల్ వస్తుంది.

Last Date To Apply PM Internship Scheme

ఈ PM Internship Scheme కు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ  ఇంటర్న్షిప్ యొక్క దరఖాస్తు చివరి తేదీ ను ప్రకటించారు. ఈ తేదీలోగా ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

SBI Internship for Freshers
SBI Internship for Freshers: SBI నుండి ఫెలోషిప్ నోటిఫికేషన్ నెలకు 20,000 

Application Last Date : April 15,2025>

>>>> Important Links 

ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్  కి రిజిస్టర్ చేసుకోవచ్చు.

PM Internship Registration 2025  Click Here 
PM Internship Login   Click Here 
Latest Govt jobs   Click Here 

గమనిక :: ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మరియు జాబ్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు..

🔍 Related TAGS 

pm internship scheme eligibility, internship scheme, pm internship scheme how to apply, pm internship, pm internship scheme 2025, paid internship scheme, pm internship scheme kya hai, internship, pm internship yojana kya hai, pm internship scheme registration

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();