
Table of Contents
🚂 RRB NTPC Technician Recruitment 2025
RRB NTPC Technician Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయితే చాలు రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలకు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋Overview Of RRB NTPC Technician Recruitment 2025
భారతీయ రైల్వే నియామక మండలి లో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. RRB నుండి టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3 పోస్టులను రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చును. అర్హత కలిగిన అభ్యర్థులు దగ్గర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Name Of The Post | Technician |
Organization | RRB(Railway Recruitment Board) |
Mode Of Application | Online |
Eligibility | Diploma/ITI/Degree |
Age Limit | 18 to 33 Years |
Number Of Vacancies | 6,180 |
Last Date | July 28, 2025 |
Official Website | www.rrbapply.gov.in |
✅ Eligibility
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా డిప్లొమా/ఐటిఐ/డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
🎂 Age Limit
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- టెక్నీషియన్ గ్రేడ్-1 : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 01-7-2025 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్-3 : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 01-7-2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
🔂 Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC/Ex-Servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
💰 Salary
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అయిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.
- టెక్నీషియన్ గ్రేడ్-1 : నెలకు రూ.29,200/-
- టెక్నీషియన్ గ్రేడ్-3 : నెలకు రూ.19,900/-
🔍 Selection Process
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Computer Based Test (CBT)
- Medical Examination
- Document Verification.
📍Post’s Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 6,180. అయితే ఈ పోస్టులను దేశ వ్యాప్తంగా అన్నీ నగరాలలో విడుదల చేశారు. కాబట్టి మీ సొంత రాష్ట్రం లోనే మీరు పని చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
💵 Application Fees
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- SC/ST/PWD/Ex-Servicemen/మహిళా అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- ఇతర కేటగిరి వారికి రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
📝 How To Apply RRB NTPC Technician Recruitment 2025
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.rrbapply.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. అక్కడ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేసి, అప్లై నౌ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం రైల్వే శాఖ అధికారులు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 28-06-2025.
Application Last Date : 28-07-2025.
🔗 Important Links
ఇప్పటివరకు పైన తెలుసుకున్న సమాచారానికి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ ని కింద ఇచ్చిన టేబుల్లో లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి.
🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్ | Click Here |
🔥 అప్లయ్ లింక్ | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇