Thalliki Vandanam Payment Status: తల్లికి వందనం డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి

Thalliki Vandanam Payment Status

🤱 Thalliki Vandanam Payment Status

మనం ఈ పేజీలో Thalliki Vandanam Payment Status సంబంధించి డబ్బులు వచ్చాయో లేదో మన మొబైల్లో మనమే ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు.

🔂 Thalliki Vandanam Payment Status Overview

ఇప్పటికీ వరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది.

WhatsApp Group Join Now

ఇవాళ సాయంత్రానికి ప్రక్రియ పూర్తవనున్నట్లు అంచనా. సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితా ఉంటుంది. ఈ నెల 20 వరకు అభ్యంతరాలు పంపొచ్చు. జూన్ 30న తుది జాబితా ప్రదర్శించి మిగిలిన అర్హులకు జులై 5న నగదు పంపిణీ చేస్తారు.

📌 తల్లికి వందనం లిస్ట్ లో నేమ్స్ లేవా?

🔻తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసిన Eligible మరియు Ineligible లిస్టులలో కొంతమంది పేర్లు లేవు.అలాంటి వాటికి కూడా గ్రీవెన్స్ నమోదుకు అతి త్వరలో ఆప్షన్ ఇస్తారు.

🔻Ineligible లిస్ట్ లో ఉన్న వాళ్ళలో ఎవరైనా అర్హులు ఉంటే Grievance Raise చేయుటకు త్వరలో ఆప్షన్ ఇవ్వనున్నారు.

♻️ పేర్లు రాని వారు wait చేయగలరు.

🟡 తల్లికి వందనం ఇంటర్మీడియట్ SC విద్యార్థులు

☀️ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ SC విద్యార్థులకు వారి తల్లి అకౌంట్ కు బదులుగా,విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ కి జమ అవుతుంది.

☀️ కావున 2024-25 లో ఇంటర్ చదివిన SC విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి వారికి NPCI లింక్ చేయించవలెను.

☀️ ఒకవేళ విద్యార్థికి ఇది వరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ కు NPCI లింక్ చేయించవలెను.

☀️ తల్లికి వందనం పథకానికి సంబంధించి NPCI లింక్ లేని ఇంటర్ SC విద్యార్థుల వివరాలు మీకు ఇది వరకే షేర్ చేయడం జరిగినది.

🟡 తల్లికి వందనం జీ ఓ. 26 హైలైట్స్ 🟡

☛ G.O.26 & 27 ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును.

☛ విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

📌 అమలు కు సంబంధించిన సమాచారం

☛ 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి తల్లికి వందనం ఇవ్వరు. 2025-26 విద్యా సంవత్సరము నుంచి ఆరంభం 2025-26 విద్యాసంవత్సరము లో హాజరు శాతంతో నిమిత్తము లేకుండా చెల్లించ బడును.

💥 ఈ పథకం పొందాలంటే అర్హతలు

☛ 2024-25 లో 75% హాజరు ఉన్న వారికే 2025-26 ‘తల్లికి వందనo’ కి అర్హులు.

☛ కుటుంబంలో ఒకరికైనా White Ration Card ఉండాలి

☛ U Dise లో Data ను Head of the Institution   వారు కరక్ట్ అని Ensure చేయాలి.

New Ration Card Status Check Online: రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోండి

☛ పిల్లల, తల్లి,  తండ్రి  లేక సంరక్షకుల ఆధార్ నెంబర్లు చెల్లుబడి అయి ఉండాలి

☛ Total House hold Monthly  Income  గ్రామాలలో రు.10000/-, పట్టణాలలో రు.12000/- మించ రాదు.

☛ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు.

☛ పట్టణాలలలో అయితే 1000 చ.అ పైబడి స్ధలము ఉండరాదు.

☛ House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు.

☛ సరాసరి నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండరాదు

☛  House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు.

☛ ఫీజు రీ ఇంబర్స్ మెంట్  సదుపాయము ఉన్న IIIIT, Poly Technical లో చదివే పిల్లల తల్లులు అనర్హులు

☛ 2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం  పరిశీలించ బడును.

☛ విద్యాహక్కు చట్టం 2009 ఫీజు లు 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి యాజమాన్యాలకు ప్రభుత్వం బకాయిల చెల్లింపులు చేయాలి.. అది ప్రభుత్వం మధ్య  యాజమాన్యాలకు సంబంధించిన వ్యవహారం తల్లిదండ్రులు గమనించగలరు. తల్లిదండ్రులకు సంబంధం లేదు.

☛ 2025-26 సంవత్సరంకు సంబంధించి RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన  వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా  ఫీజు  క్రింద TV  చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును.

☛ తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్  Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా  కలెక్టరు ద్వారా చెల్లించబడును

📃 షెడ్యూల్

☛ G.O.27 లో  పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు  చదువు చున్న అర్హులైన    విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో  (Publish)  ప్రదర్శిస్తారు.

☛ July 5 న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది.

🔴 తల్లికి వందనం పథకం

☛ అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు 10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు, ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 తారీకు వరకు వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితా లో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి.

☛ ఈ సంవత్సరం ఇంటర్ 2nd year పూర్తి అయిన విద్యార్ధులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్యదీవేన పథకం కిందకి వస్తారు.

♐ WhatsApp లో కూడా తల్లికి వందనం పేమెంట్ స్టేటస్

☛ ఇక నుంచి మీరు మీ వాట్సాప్ లో కూడా తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చును.

NPCI Status Check Online 2025
NPCI Status Check Online 2025: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి

☛ తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి మీరు అర్హులో కాదో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోగలరు. అలాగే పేమెంట్ పడిందో లేదో కూడా తెలుసుకోవచ్చును.

🔍 How to Check Thalliki Vandanam Payment Status

ఈ కింద చెప్పైన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి Thalliki Vandanam Payment Status or అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి.

Thalliki Vandanam Payment Status 2025

✳️ Step :- ఫస్ట్ అఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ అయిన NBM Application Status సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

✳️ Step :- పైన ఇమేజ్లో చూపించిన విధంగా ఓపెన్ అయిన వెంటనే మీకు సంబంధించి స్కీం అనగా టైటిల్ మీద క్లిక్ చేయగానే అన్ని రకాల పథకాలు రావడం జరుగుతుంది.

✳️ Step :- అందులో తల్లికి వందనం స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించి ఇయర్ సెలెక్ట్ చేసుకోండి.

✳️ Step :- 2025-2026 year సెలెక్ట్ చేసుకోండి.

✳️ Step :- తరువాత మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్షర్ ఎంటర్ చేయండి.

✳️ Step :- మీ ఆధార్ కార్డుకి లింక్ ఇన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ otp ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తానే మీ అప్లికేషన్ స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ కనిపించడం జరుగుతుంది.

✳️ Step :- మీకు ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది. ఆ బ్యాంక్ పేరు కనిపించడం జరుగుతుంది.

Important Link’s

తల్లికి వందనం సంబంధించి పేమెంట్ స్టేటస్ లింక్ మరియు కొత్తగా వచ్చిన G.O and NPCI లింక్ ఇవ్వడం జరిగిన ఓపెన్ చేసి చెక్ చేసుకోగలరు.. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్Click Here
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ వాట్సాప్ నెంబర్Click Here
🔥 తల్లికి వందనం జీవో Click Here
🔥 NPCI లింక్ ( ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ )Click Here
🔥 కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

📽️ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెకింగ్ ప్రాసెస్

మీకు తల్లికి వందనం సంబంధించి పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన డెమో వీడియోని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

📽️ Demo Video : Click Here

📽️ Demo Video :Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now