వాలంటీర్స్ నీ కొనసాగించలేం: ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన!

వాలంటీర్స్

వాలంటీర్స్ నీ కొనసాగించలేం: ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన!

తాజాగా వాలంటీర్స్ పై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. ప్రెస్ అడిగిన ప్రశ్నకు ఈ క్రింది విధంగా నారా లోకేష్ గారు వాలంటీర్స్ పై స్పందించారు..

WhatsApp Group Join Now
  • ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ
  • వాళ్లను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు
  • పుట్టని బిడ్డకు పేరెలా పెడతారంటూ పునరుద్ఘాటన
  • వాలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ..
  • వాలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు చెల్లించిన జగన్ సర్కారు.. హెడ్ ఆఫ్ అకౌంట్ల వివరాలే నిదర్శనం
  • బాబు సర్కారు నమ్మక ద్రోహంపై వలంటీర్ల ఆందోళన బాట.. నిరసనలు

ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తాజాగా స్పష్టీకరణ

వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయ పరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వలంటీర్లపై స్పష్టమైన విధానంతో ఉన్నామని చెప్పారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని తమ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. అంతేకాకుండా మీ గౌరవ వేతనాన్ని నెలకు రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తాం’ అని ఎన్నికల ముందు ఎం తో నమ్మకంగా ఊరూరా బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన చంద్రబాబు, లోకేశ్.. కూటమి పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ఇలా మాట మార్చడం విస్తుగొలుపుతోంది. మంత్రి లోకేశ్ తీరు ఏరు దాటాక తెప్పను తగలేసిన వైనాన్ని గుర్తుకు తెస్తోంది. ప్రజల ఇళ్ల వద్దకే సేవలు అందించడానికి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగడం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నేతలు ఎన్నికల కమిషన్ న్ను అడ్డుపెట్టుకుని వలంటీర్ల సేవలను ఆపించినా, గత ప్రభుత్వం వారికి ఏప్రిల్, మే నెల జీతాలు అందజేసింది.

NTR Bharosa pension update
NTR Bharosa Pension Update : రాష్ట్రంలో పెన్షనర్ల అందరికీ ఈ పని తప్పనిసరి ఆదేశాలు జారీ

Also Read ::- ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్

జీతాలకే డబ్బుల్లేవు

ప్రతినెలా రూ.4 వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్ర బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి సైతం ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకొస్తున్నాం’ అని లోకేశ్ అన్నారు. గంజాయి నిర్మూలనకు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. వాల్తేరు డివిజన్ ను రెండు రాష్ట్రాలు చూసుకుంటాయని, మిలీనియం టవర్లో టీసీఎస్ సెంటర్ రావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుందన్నారు. పలు జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రైల్వే జోన్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు.

డైలీ న్యూస్ పేపర్స్ ఫ్రీ గా చదివేయండి

Today News 2025
Today News 2025: ఈరోజు వరకు వచ్చిన లేటెస్ట్ న్యూస్

వాలంటీర్లకు 10,000 వేలు హామీ ఏమైంది?

గతంలో టిడిపి అధికారంలోకి రాకముందు వాలంటీర్స్ అందరికీ 10000 ఇస్తాము.. అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్ చేస్తాము. అని సోషల్ మీడియాలో మరియు ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వాలంటీర్స్ మీదనే ఫోకస్ చేసి చెప్పడం జరిగింది.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్స్ జీవోలోనే లేరు.. అసలు వాళ్లని ఎప్పుడో తీసేశారు.. వైసిపి గవర్నమెంట్ కి వాలు పనిచేశారు ప్రభుత్వానికి కాదు.. అని ఇప్పుడు మాట దాటేస్తున్నారు.. ప్రస్తుతానికి వాలంటీర్లు పరిస్థితి ఎటు గాని విధంగా తయారయింది.. దాదాపుగా లక్షన్నరకు పైగా వాలంటీర్స్ ని రోడ్డు మీద పడేయడం జరిగింది..   

వాలంటీర్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మా వాట్సాప్ గ్రూపులో అప్డేట్ చేయడం జరుగుతుంది.. ఇన్ఫర్మేషన్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now